పానీ పూరి

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: నలబై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1827
Likes :

Preparation Method

పూరీ  తయారీ

  • మైదా , ఉప్పు , వంట సోడా జల్లించుకోవాలి.
  • ఇప్పుడు మైదా , వంట సోడా, ఉప్పు, రవ్వ, ఇదయం నువ్వుల నూనె ను కలుపుకోవాలి.
  • కొద్దీ కొద్దీ గా నీటి ని కలుపుతూ గట్టి ముద్ద లా కలిపి పూరీలని సిద్ధం చేసుకోవాలి.

రసం తయారీ

  • కోతి మీర ఆకులు, పుదీనా ఆకులు, మరియు పచ్చి మిరప కాయలను మెత్త గా  రుబ్బుకోవాలి.
  • అందులో చింతపండు గుజ్జు, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ,నల్ల ఉప్పు , బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.
  • తగినంత ఉప్పు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.

మిశ్రమం తయారీ

  • బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి మెదిపి పక్కన పెట్టుకోవాలి.
  • బఠాణి కూడా ఉడికించి మెదిపి ఉంచుకోవాలి..
  • ఇప్పుడు ఉడికించి మెదిపి పెట్టుకున్న దుంపలు , బటాణీ  ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి.

గ్రీన్ చట్నీ తయారీ కోసం

  • కొత్తిమీర ఆకులు , పుదీనా , పచ్చి మిరపకాయలు, పంచదార , అల్లం , మరియు ఉప్పు అన్నిటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • నిమ్మకాయ రసం కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.

చింతపండు చట్నీ తయారీ.

  • తాటి బెల్లం , కారం, జీలకర్ర పొడి, చింతపండు , ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఈ మిశ్రమం ని పక్కన ఉంచాలి.

పానీ పురీ కోసం.

  • పూరి మీద నెమ్మది గా తట్టి రంధ్రం చేయాలి.
  • ఆ పూరీ ని బంగాళాదుంప మిశ్రమం, బూందీ , గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, మరియు రసం (పానీ) వేసి అందించాలి.

 

 

You Might Also Like

Engineered By ZITIMA