మలై కోఫ్తా

Spread The Taste
Serves
5
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1654
Likes :

Preparation Method

కోఫ్తా తయారీ విధానం: 

  • బంగాళాదుంపలు ఉడకపెట్టి, పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి.
  • పన్నీర్ తురుముకోవాలి.
  • కొత్తిమీర ఆకులు, పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకోవాలి.
  • మైదా, నీళ్ళు, జీలకర్ర, తురిమిన పన్నీర్, కొత్తిమీర, తురిమిన అల్లం, మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • చేతులకు కొద్దిగా నూనె రాసుకొని, ఈ మిశ్రమాన్ని 4 భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
  • ఒక మందపాటి పాన్ లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసి, నూనె బాగా వేడెక్కిన తరువాత కోఫ్తా ఉండలు వేసుకొని బాగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
పులుసు తయారీ విధానం:
  • టమాటా, పచ్చిమిరపకాయలు మరియు అల్లం తీసుకొని మెత్తగా చేసుకోవాలి.
  • మైదా, ఫ్రెష్ క్రీం కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
  • జీలకర్ర, ఇంగువ, రుబ్బుకున్న టమాటా ముద్దా, ధనియాల పొడి, పసుపు, మరియు కారం వేసి 4 నిముషాల సేపు వేగించి, అలాగే ఉంచి పులుసు నుంచి నూనె బయటకు వచ్చేవరకు ఉడికించాలి.
  • ఇందులో మైదా, ఫ్రెష్ క్రీం మిశ్రమాన్ని, ఒక కప్పు నీళ్లు  పోసి, ఉప్పు వేసి కలపాలి. స్టౌ మంట చిన్నది చేసుకొని 7 నిముషాల సేపు ఉంచాలి.
  • దీనికి గరం మసాలా పొడి, కొత్తిమీర కలపాలి.
  • ఒక నిముషం తరువాత కోఫ్తా ఉండలు చిన్నగా తిప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ మిశ్రమం  మరగటం మొదలవుతుందో, వెంటనే స్టౌ మీదనుంచి దించి వేడి వేడిగా వడ్డించాలి.

Choose Your Favorite North Indian Recipes

  • పప్పు బెండకాయ

    View Recipe
  • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

    View Recipe
Engineered By ZITIMA