మిక్సడ్ ఫ్రూట్ పుడ్డింగ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఒక గంట
Cooking Time: ఇరవైఐదు నిమిషాలు
Hits   : 811
Likes :

Preparation Method

 • ఒక కప్పు నీటిలో చైనా గడ్డిని నానబెట్టాలి.
 • ఆపిల్ ని ముక్కలుగా చేయాలి.
 • నీటిలో ఒక కప్పు పంచదారని కరిగించాలి.
 • మిగిలిన పంచదారని ప్పొడి చేసుకోవాలి.
 • ఖర్జురాలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
 • తీగ పాకం వచ్చేవరకు పంచదార మరిగించాలి.
 • ఇందులో ఆపిల్ ముక్కలు,నారింగా తొనలు వేసి ఉడికించాలి.
 • ఉడికిన తర్వాత ఖర్జురము ముక్కలు కలపాలి.
 • ఒక గిన్నెలో ఘనీకృత పాలు, పంచదార పొడి కలిపి ఒక గంట వరకు పక్కన ఉంచాలి.
 • దీనికి పాలను కలిపి తక్కువ మంటలో ఉంచాలి. మరగకుండా చూడాలి.
 • బాగా కలిపి మంట నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
 • వేరొక పెనములో చైనా గడ్డి మిశ్రమం వేసి తక్కువ మంట మీద ఉంచాలి.
 • బాగా కలుపుతూ పాకం కూడా వేసి ఉండలు కట్టపైన కలుపుకోవాలి.
 • మంట నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
 • ఘనీకృత పాలు చైనా గడ్డికి కలుపుకోవాలి.
 • దీనిని ఇరవై నిమిషాల పాటూ పక్కన ఉంచాలి.
 • ఒక పెద్ద గిన్నెలో అనాస పనస ముక్కలు వేసుకోవాలి.
 • పంచదార మిశ్రమంని పండ్లముక్కలకు కలపాలి.
 • రెఫ్రిజిరేటర్ లో పెట్టి చల్లగా అందించాలి.
Engineered By ZITIMA