కోడిగుడ్డు పులుసు

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 5610
Likes :

Preparation Method

  • ధనియాలపొడి, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, కారం, పసుపు కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • కొబ్బరిని తురిమి, అందులోంచి కొబ్బరి పాలు తీసుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయలను మధ్యస్తం ముక్కలుగా కోసుకోవాలి.
  • అడుగు మందంగా, వెడల్పుగా ఉన్న ఒక పాన్ తీసుకొని అందులో ఇధయం నువ్వుల నూనె వేసి వేడిచేయండి.
  • ఉల్లిపాయలు వేసి వేయించి, మెత్తగా రుబ్బుకున్న మసాలా ముద్దా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
  • కొబ్బరి పాలు పోసి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • కొంచంసేపు ఉడకనివ్వండి.
  • ఒక్కొక్క గుడ్డుని నిదానంగా పులుసులో కార్చండి. దీనిని కలుపుకోకూడదు.
  • స్టౌ మంటని తగ్గించి, పాన్ ని నిదానంగా గుండ్రంగా కదిలించండి.
  • గుడ్లు ఉడికిన తరువాత, మంట మీదనుంచి తీసి వేడివేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA