షార్క్ ఫిష్ - ఓక్రా ఫ్రై

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 706
Likes :

Preparation Method

 • చేపకు పసుపు, కారం, ఉప్పు కలిపి 30 నిముషాలు ఊరబెట్టాలి
 • ఒక పాన్ తీసుకొని జీలకర్ర, సోంపు, మెంతులు, ఎండు మిరపకాయలు వేసి పొడిగా వేయించి, కొంచం బరకగా పొడి చేసుకోవాలి.
 • బెండకాయలు తీసుకొని ఒక అంగుళం పొడవు ముక్కలుగా కోసుకోవాలి.
 • టమాటాలు పొడవుగా, సన్నగా కోసుకోవాలి.
 • ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ముక్కలుగా చేసుకోవాలి.
 • ఒక పాన్ లో ఇధయం నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు తీసుకొని వేడిచేసుకోవాలి.
 • ఊరపెట్టిన చేప ముక్కలు తీసుకొని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
 • వేరొక పాన్ లో మిగతా ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
 • వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలయపెట్టాలి.
 • దీనికి పొడి చేసి పెట్టుకున్న మసాలాలు వేసి, ఒక నిముషం సేపు వేయించుకోవాలి.
 • దీనిలో టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.
 • బెండకాయ ముక్కలు, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి.
 • అంతా బాగా కలిసేవరకూ వేయించుకోవాలి.
 • వేయించి ఉంచిన చేప ముక్కలు వేసి, స్టౌ చిన్న మంటలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
 • మంట మీదనుంచి తీసి, వేడివేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA