కాశ్మీరీ నాన్ రోటి

Spread The Taste
Serves
రెండు
Preparation Time: రెండు గంటల పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 572
Likes :

Preparation Method

  • ఒక పెద్ద గిన్నెలో మైదా,ఈస్ట్ , అర టీ స్పూన్ పంచదార, ఉప్పు బేకింగ్ పొడి, వంట సోడా వేసి కలుపుకోవాలి.
  • పిండి మధ్యలో పెరుగు,పాలు,వెన్న వేసుకోవాలి.
  • పిండి ని ముద్దగా కలుపుకోవాలి.
  • కలిపిన ముద్ద ని ఐదు నిమిషాల వరకూ అలాగే ఉంచాలి.
  • గది వాతావరణంలో రెండు గంటలు ఉంచాలి , ఆ పిండి రెండింతలు అవుతుంది
  • బాదంని వేడి నీటిలో నానబెట్టుకోవాలి.
  • తర్వాత తొక్క తీసి చెర్రీ పళ్ళు, జీడిపప్పు ,పంచదార వేసి మెత్తగా చేసుకోవాలి.
  • పిండి ముద్దని నాలుగు సమాన భాగాలూగా చేసుకోవాలి.
  • చపాతీ పీట మీద మైదాని చల్లుకోవాలి.
  • చిన్న పిండి ముద్దని తీసుకొని గుండ్రంగా వత్తుకోవాలి.
  • మధ్యలో జీడిపప్పు మిశ్రమం వేసి మూసేయాలి.
  • మిగిలిన పిండితో ఈ విధంగానే చేసుకోవాలి.
  • చపాతీ కర్రతో రెండువైపులా సమానంగా వత్తుకోవాలి.
  • ఒక నాన్ స్టిక్ పెనం లో నాన్ రొట్టెని వేసి మూత పెట్టుకోవాలి.
  • బంగారు రంగు వచ్చేవరకూ కాల్చుకొని, దించి అందించుకోవాలి.
Engineered By ZITIMA