పచ్చబఠాణీలు కచోరి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముపై నిమషాలు
Cooking Time: ముపై నిమషాలు
Hits   : 4028
Likes :

Preparation Method

పై భాగం  కోసం:
  • మైదా పిండిని జల్లించి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి . 
  •  పై మిశ్రమాన్ని నెయ్యితో బాగా కలిపి ఒక మృదువైన పిండిగా పిసికి కలపాలి .               కూర్చటం కోసం :                                                                                                           : 
  •  బటానీలు ఉడికించి,  దానిని గుజ్జులా కలపాలి . 
  • ఒక పెనంలో నువ్వులు  నూనె వేసి వేడి చేసి , పచ్చిమిర్చి-అల్లం ముద్ర వేసి  కదుపుతూ ఉండాలి.
  • ధనియాల పొడి, జీలకర్ర పొడి, బటానీలు, ఉప్పు, శనగపిండి వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  • తగినంత  ఉప్పు వేసి దగ్గరకు అయ్యాక  మంట నుండి తొలగించి పక్కన పెట్టాలి.                                                                                                                                              కచోరి తయారుచేయు విధానం:
  • ముందుగా తయారుచేసిన  పిండిని ఆరు సమాన భాగాలుగా చేయాలి . 
  • పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి,చపాతీ కర్ర తో మందముగా  మూడు అంగుళాలు వరకు అదుముకోవాలి.
  •  తయారు చేసిన మిశ్రమాన్ని మందముగా చపాతీలా  చేసిన పిండి లో  మధ్యలో పెట్టి ,నీళ్ళతో చివర్లలో అదిమి అన్నివైపులా నుంచి ముసాయియాలి.
  • ఆ ముద్దని నాలుగు అంగుళాల చపాతీలుగా  చేసుకోవాలి. 
  • మిగిలిన పిండిని కూడా ఇలానే  చేసుకోవాలి.
  • కడై లో నువ్వులు నూనె వేసి కచోరీలను  వేసి అవి గోధుమ రంగు వచ్చినంత వరకు ,కరకరలాడేల  వేపాలి.
  • వేడిగా అందించాలి.
Engineered By ZITIMA