రసం వడలు

Spread The Taste
Serves
పది
Preparation Time: యాభై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 674
Likes :

Preparation Method

రసం తయారీ కోసం
  • ముందు గా చింత పండు ని నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
  • ఈ చింత పండు గుజ్జు లో జీలకర్ర పొడి, మిరియాల పొడి కలిపి ఉంచాలి.
  • వెల్లుల్లి ని దంచుకోవాలి.
  • ఎర్ర మిరపకాయలను చీలికలు గ చేసుకోవాలి.
  • ఒక పాన్ లో ఒక టీ స్పూన్ ఇదయం నువ్వుల నూనె ను వేడి చేసుకోవాలి.
  • నూనె వేడి అయ్యాక ఆవాలు , కరివేపాకు, ఎర్ర మిరపకాయలు, మరియు ఇంగువ వేయాలి.
  • అందులో చింతపండు గుజ్జు ని కూడా వేసి మరిగించాలి.
  • ఈ రసం మరిగిన తర్వాత ఉప్పు, కొత్తిమీర ఆకులు వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు మంటమీద నుంచి దించి పక్కన ఉంచాలి.

వడ తయారీ కోసం

  • ముందుగా మినప పప్పు ని ముపై నిమిషాల పాటు నానబెట్టాలి.
  • నానబెట్టిన పప్పు ని నీరు కలపకుండా మెత్త గా రుబ్బుకోవాలి.
  • ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇందులో చిన్న ఎర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరప ముక్కలు వేసి కలుపుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ని వేసి, అది వేడి అయ్యాక ,ఒక నిమ్మకాయ అంత పరిమాణం లో వడ మిశ్రమం ని తీసుకొని మధ్యలో రంధ్రం చేసుకోవాలి.
  • నూనె లో వేసుకోవాలి
  • రెండువైపులా ఎర్రగా కరకర లాడేలా వేయించాలి.
  • వేగిన వడలను నీటి లో ముంచి తర్వాత రసం లో నానబెట్టాలి.
  • ఇప్పుడు ఈ వడలను కొత్తిమీర ఆకులతో అలంకరించి అందించాలి.


Engineered By ZITIMA