చికెన్ - బంగాళా దుంప కుర్మా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 4451
Likes :

Preparation Method

 • చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి .
 • బంగాళ దుంపలు ఉడికించి, తొక్క తీసి ,పెద్ద ముక్కలుగా చేసుకోవాలి.
 • ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలు, పెద్ద ఉల్లిపాయ ,మరియు అల్లం వేసి ముద్దలా చేసుకోవాలి .
 • పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కోసుకోవాలి.
 • టమోటా ముక్కలుగా కోసుకోవాలి.
 • కొబ్బరి తురుముని ముద్దలా చేసుకోవాలి .
 • ఒక పెనం లో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి.
 • దాల్చిన చెక్క,లవంగాలు మరియు అనాస పువ్వు వేయించాలి.
 • ఉల్లిపాయలను మరియు టమోటాలను దోరగా వేయించాలి.
 • మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. 
 • చికెన్ ముక్కలని వేసి మూడు నిమిషాలు పాటు వేయించాలి.
 • తగినంత నీళ్లు వేసుకోవాలి.
 • కారం, పసుపు, ఉప్పు వేసి మరియు బాగా కలుపుకోవాలి.
 • ఇగురు దగ్గరుకు వచ్చేసరికి,కొబ్బరి ముద్దను వేసుకోవాలి.
 • చికెన్ ఉడికి కుర్మా తయారయ్యాక, పొయ్య మీద నుంచి దించాలి.
 • ఇడ్లీ, దోస, పరాటా, పూరి మరియు వేడి అన్నం లో వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA