కాశ్మీరీ చికెన్

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 4178
Likes :

Preparation Method

  • చికెన్ తొడ ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి 
  • ఒక చిన్న పాన్ లో పొట్టుతీసిన ఇలాచీ గింజలు ,ధనియాలు ,జిలకర ,మిరియాలు లవంగం వేసి వేయించి పొడి చేసిపెట్టుకోవాలి 
  • కుంకుమ పువ్వు ని వేడి నీళ్లలో నానపెట్టాలి 
  • ఉల్లిపాయలు తరిగిపెట్టుకోవాలి 
  • బాదాం రుబ్బి పెట్టుకోవాలి 
  • పిస్తా ని ఒక పది నిముషాలు వేడి నీళ్లలో ఉంచి తరువాత చిన్న గ తరిగి పెట్టుకోవాలి 
  • ఒక వెడల్పాటి పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయల్ని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి 
  • అవి వేగక్క అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించుకోవాలి ,తరువాత రుబ్బి పెట్టుకున్న మసాలా ,చెక్క వేసి  వేయించుకోవాలి 
  • స్టవ్ పైన నుంచి దించి పెరుగు వేసి ఒక మూడు నిముషాలు బాగా కలపాలి 
  • ఇపుడు మల్లి స్టవ్ మీద ఉంచి మల్లి ఒక మూడు నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి 
  • చిన్న మంట పైన ఉంచి మూత పెట్టి  ఒక ఇరువై నిముషాలు ఉంచాలి 
  • తరుచు కలుపుతూ ఉండాలి 
  • అవసరానికి తగట్టు నీళ్లు మరియు ఉప్పు వేయాలి 
  • దానిలో బాదాం పేస్ట్ ,తరిగిన పిస్తా ,కుంకుమ పువ్వు ,కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టాలి 
  • చికెన్ ఉడికినాక ,గ్రేవీ చిక్కపడక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA