ఎలా అడా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై ఐదు నిమిషాలు
Hits   : 1225
Likes :

Preparation Method

మిశ్రమం తయారీ

 • బెల్లం, కొబ్బరి తురుము కలిపి పెట్టుకోవాలి.
 • తురిమిన కొబ్బరి మరియు బెల్లం కలిపి తక్కువ మంటలో పెట్టి చిక్కబడే వరకు కలుపుకోవాలి.
 • మంట నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.

బియ్యం మిశ్రమం కోసం

 • బియ్యం నానబెట్టి,వడబోసి పక్కన పెట్టుకోవాలి.
 • బియ్యం ని ఎండబెట్టి ,దంచి పొడి చేసుకోవాలి.
 • ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.ఉప్పు నెయ్యి వేసి తక్కువ మంటలో ఉంచి వేడి చేసుకోవాలి.
 • ఇప్పుడు బియ్యం పొడి వేసి బాగా కలపాలి.
 • బాగా చిక్కబడ్డాక, మంట నుంచి దించుకోవాలి.
 • చల్లబడ్డాక , పిండిని పిసికి ఉంచుకోవాలి.
 • చిన్న చిన్న ఉండలు గా చేసుకోవాలి.

ఎలా అడా తయారీ కోసం

 • నెయ్యి రాసి ఉంచిన ఒక అరటి ఆకులో బియ్యం ముద్దని వేసుకోవాలి.
 • వేరొక ఆకులో నెయ్యి రాసి ముద్దపై ఉంచి పల్చగా వత్తుకోవాలి.
 • గుండ్రం గా అయ్యాక అరటి ఆకును నెమ్మది గా తీసేయాలి.
 • ఇందులో ముందు సిద్ధం చేసిన మిశ్రమం పెట్టి అంత పరుచుకోవాలి.
 • అరటి ఆకును మడిచేయాలి.
 • ఒక చిన్న ఉండాలా ఎలా అడా తయారవుతుంది.
 • ఈ విధంగానే మిగిలిన మిశ్రమం కూడా తాయారు చేసుకోవాలి.
 • ఒక ఆవిరి పాత్రలో నీటిని పోసి మరిగించాలి.
 • నెయ్యి రాసిన ఒక ఇడ్లి ప్లేట్ లో ఎలా అడాని ఉంచి పది నిమిషాల వరకు ఆవిరి మీద ఉంచాలి.
 • తర్వాత మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

Choose Your Favorite South Indian Festival Recipes

Engineered By ZITIMA