శనగపప్పు దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 7 నిముషాలు
Hits   : 5964
Likes :

Preparation Method

తయారీ విధానం:

  • శనగపప్పు మరియు బియ్యాన్ని రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుతూ పిండి రుబ్బుకోవాలి.
  •  ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాప్సికం, కరివేపాకు మరియు టమాటని ముక్కలుగా కోసుకోవాలి.
  • దోశల మిశ్రమంలో కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, టమాట, కరివేపాకు, కాప్సికం, జీలకర్ర, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం మధ్యలో పిండి ఉంచి గుండ్రంగా తిప్పుతూ పెనం అంచుల వరకు పరచాలి.
  • దోశ అంచుల వద్ద కొద్దిగా ఇధయం నువ్వుల నూనె వేసుకోవాలి.
  • దోశ ఎర్రగా కాలినాక, దోశని తిప్పుకొని రెండవ వైపు కూడా ఎర్రగా కాల్చాలి.
  • మిగిలిన  పిండితో కూడా ఇలాగే దోశలు వేసుకోవాలి.
  • ఇలా తయారైన దోశల్ని వేడి వేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA