మటన్ కీమా దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 4 నిముషాలు
Hits   : 1138
Likes :

Preparation Method

 • ప్రెషర్ కుక్కర్ తీసుకొని, మటన్ కీమా మరియు పసుపు వేసి ఉడికించాలి.
 • ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి.
 • పచ్చిమిరపకాయలు చిన్నగా గుండ్రంగా కోసుకోవాలి.
 • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
 • ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి.
 • ఉడికించిన మటన్ కీమా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
 • మటన్ కీమాకి మసాలా అంతా బాగా పట్టేవరకు వేయించుకోవాలి.
 • మంటమీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
 • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు దోశల పిండి తీసుకొని పలుచగా పెనం అంతా పరుచుకోవాలి.
 • దోశ అంచులమీద కొద్దిగా నూనె వేసుకోవాలి.
 • ఎర్రగా కాలిన దోశని రెండవవైపు తిప్పుకోవాలి.
 • మరలా దోశని తిప్పుకొని, ఒక టేబుల్ స్పూన్ మటన్ కీమా తీసుకొని దోశ మొత్తం పరచాలి.
 • దోశని మధ్యకు మడిచి, వేడి వేడిగా వడ్డించండి.  
Engineered By ZITIMA