అరిసెలు

Spread The Taste
Makes
30 అరిసెలు
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 7559
Likes :

Preparation Method

 • బియ్యం ఒక గంటసేపు నాననివ్వాలి.
 • బియ్యం వడకట్టి, ఒక పలచని బట్టమీద ఆరబెట్టాలి.
 • బియ్యం కొంచం తడిగా ఉండగానే పిండి పట్టుకోవాలి.
 • జల్లెడలో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని పిండి జల్లెడ పట్టుకొని, వచ్చిన నూకను పక్కన పెట్టుకోవాలి.
 • మరలా ఒక సన్నని జల్లెడ తీసుకొని జల్లడ పట్టుకోవాలి.
 • అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని, రెండు టీస్పూన్ల నీళ్లు పోసుకొని, పొడి చేసుకున్న బెల్లం వేసి పాకం తయారు చేయాలి.
 • పాకం చూడటం కోసం, ఒక మూతలో నీళ్లు తీసుకొని అందులో రెండు చుక్కల పాకం వెయ్యాలి. పాకం నీళ్ళల్లో కరగకుండా, ఉండ కట్టడానికి వీలుగా ఉంటే పాకం తయ్యారు అయినట్లే.
 • పాకంలో జల్లెడ పట్టుకున్న బియ్యం పిండి పోసుకోవాలి.
 • ఇందులో గసగసాలు, యాలకుల పొడి, నెయ్యి వేసుకొని బాగా కలపాలి.
 • పాకం నుంచి చిన్న ఉండ తీసుకొని, నూనె రాసుకున్న అరటి ఆకు మీద ఒత్తుకోవాలి.
 • గుండ్రంగా, కొంచం మందంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా ఒక అయిదు , ఆరు చేసుకొని పెట్టుకోవాలి.
 • అడుగు మందంగా ఉన్న ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె వేడిచేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత, చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
 • ఒక గరిటెడు నూనె తీసుకొని అరిసెల మీద పోసుకోవాలి.
 • ఒక వైపు అరిసె కాలిన తరువాత, రెండవ వైపు తిప్పుకొని కాల్చుకోవాలి.
 •  అరిసె రెండువైపులా ఉడికిన తరువాత, రెండు గరిటెల మధ్యలో అరిసె తీసుకొని ఎక్కువగా ఉన్న నూనె తీసివేయాలి, ఇలా చేయటం వాళ్ళ అరిసె మృదువుగా ఉంటుంది.
 • ఇదే విధంగా మిగిలిన పిండితో అరిసెలు చేసుకొని, ఎక్కువగా ఉన్న నూనెను వత్తి తీసేసుకొని, వడ్డించండి. 

Choose Your Favorite Diwali Recipes

 • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

  View Recipe
Engineered By ZITIMA