Preparation Time: ఇరవై నిమిషాలు Cooking Time: ముపై నిమిషాలు
Hits : 853 Likes :
Ingredients
బంగాళా దుంపలు ఐదు వందల గ్రాములు
ధనియాల పొడి ఒక టీ స్పూన్
గసగసాలు ఒక టీ స్పూన్
నువ్వులు ఒక టేబుల్ స్పూన్
పచ్చి మిరపకాయలు మూడు
ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు
అల్లము, వెల్లుల్లి ముద్ద రెండు టీ స్పూన్
ఆవాలు అర టీ స్పూన్
వేయించిన సెనగ పప్పు ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క రెండు ముక్కలు
లవంగాలు రెండు
యాలకులు రెండు
పెద్ద ఉల్లిపాయ ఒకటి
టమాటో రెండు
పెరుగు రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు తగినంత
నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
ఇదయం నువ్వుల నూనె మూడు టేబుల్ స్పూన్లు
Preparation Method
ముందుగా ఒక అంగుళం చొప్పున బంగాళా దుంపలని ముక్కలుగా చేసుకోవాలి.
తర్వాత ధనియాల పొడి,గసగసాలు,నువ్వులు, పచ్చిమిరపకాయలు,ఎండు కొబ్బరి తురుము కలిపి మెత్తగా ముద్దగా చేసుకోవాలి.మరియు అందులో అల్లము,వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి.
ఉల్లిపాయలు టమాటాలను బాగా తరుగుకోవాలి.
ఒక పెనంలో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
ఆవాలు,వేయించిన సెనగ పప్పు,దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు వేసి వేయించుకోవాలి.
తర్వాత ఉల్లిపాయలు , టమాటో,బంగాళా దుంపలు , ఉప్పు వేసి బాగా దోరగా వేయించాలి.
అందులో ముందుగా సిద్ధం చేసి ఉంచిన మసాలా ముద్ద వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించాలి.
బంగాళా దుంపలు ఉడికేవరకు తక్కువ మంట మీద ఉంచాలి.
పెరుగు వేసి,బాగా కలిపి వెంటనే మంట నుండి దించుకోవాలి.
కొత్తిమీర చల్లి, అన్నంతో గాని,చపాతీతోగాని వేడి వేడిగా అందించాలి.